Tuesday, November 27, 2012

మణి దీపం...


మణి దీపం...




మదిలొ మెదిలె ఆలోచనలకు
ప్రతిరూపాలు మన కళలే కదా
చిత్రమైనా ,,భావచిత్రమైనా
ప్రదర్శిస్తే బహు చిత్రమే కదా..

నా మనసున ఉన్న ఆలోచనలకు
ఒక రూపం కల్పించాను
ఆ రూపమే అపురూపమై
అమర దీపమైయ్యింది

హృదయ దీపం,, పదిలమైన మణి దీపం
జీవితాన వెన్నెల వెలుగులు నింపుతున్న దీపం
వెదురును, వేణువుగా మార్చిన దీపం
శిలను శిల్పంగా మార్చి మందిరాన నిలిపిన దీపం

Friday, November 23, 2012

విన్నపాలు...


విన్నపాలు...

ప్రియా,,,
నీ ముంగురులే చిటికెడు చీకటికాగా
నీ పెదవులపై చిరునవ్వే
పిడికెడు వెన్నెలగా విరపూయగా
నీ అరవిందములే
విరిసిన గుప్పెడు మల్లెలుకాగా..





తలచిన నామనసును
నీ తలపులతో నింపి
నీ విరహసందేశం
ఆ మేఘమాలతో పంపి
మెత్తని నీ హృదయంలో
సుతిమెత్తని నా గ్నాపకాలను
పదిలపరచానన్నాన్నవు..

వలచిన చెలికి ఏమని తెలుపను
మనసున పలికిన ఆమని పిలుపును

బంగారానికే సింగారమననా..
సింగారానికే వయ్యారమననా..
వయ్యారానికే వలపు పుట్టిందననా..
ఆ వలపే నీ తలపననా....
http://www.facebook.com/svs.vennela


Wednesday, November 21, 2012

నిన్నే తలచిందే ,, నా మనసు


నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు

పరుగెట్టే నీ వెనుకా,పడుతున్నాననుకోక
ఒక్కసారి చూడవే  ఓ నెలవంకా
అదిరేటి పెదవులపై అలుకెందుకె ఓ చిలుకా
పక్కనున్న మక్కువైన చెలికాడనునేనుండ


నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు

కంటి చూపుతోనే కావ్యాలను వ్రాసావు
వెన్నెలింటిలోనే నే విరహంతో వేచాను
నాతోడువు నీవైతే నీ నీడగ నేనుంటా
జగమంతా ఒకటైనా ఒటరినై ఎదిరిస్తా

నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు

http://www.facebook.com/svs.vennela

Friday, November 16, 2012

శుభాకాంక్షలు...

 శుభాకాంక్షలు...








సంకల్పం


సంకల్పం



ఆకాశం అందేనంటూ
ఎగసెటి అలనేనంటూ
విశ్వాసం నా ఊపిరిఅంటూ
విజయం నా బాటేనంటూ
చెప్పాలని ఉందంటూ
నీకంటూ నచ్చేట్టూ
జగమంతా మెచ్చేట్టూ

కొండలు పిండి చేయాలంటూ
మస్థిష్కమును మధించాలంటూ
ఎవరెష్టును ఎక్కాలంటూ
నైలునదినీ ఈదాలంటూ
చెప్పాలని ఉందంటూ
నీకంటూ నచ్చేట్టూ
జగమంతా మెచ్చేట్టూ

నీ స్వేదమె సంపద అంటూ
నేడే నిర్వేదం విడవమంటూ
సంకల్పం ధృఢమైతే
ఏరులెదురొచ్చినా
విజయుడవు నీవేనంటూ
చెప్పాలని ఉందంటూ
నీకంటూ నచ్చేట్టూ
జగమంతా మెచ్చేట్టూ


http://www.facebook.com/svs.vennela?ref=tn_tnmn

Wednesday, November 7, 2012

మనమంతా ఒకటై



హిమమంతా జలమై
జలమంతా జగమై
జగమంతా జనమై
జనమంతా మనమై

మనమంతా ఒకటై
ఒకటైన స్వరమై
ఆ సుస్వరమె ఒక వరమై
పరమశివుని పాద ధూళినై
ప్రణమిల్లిన ప్రక్రుతికి ఆక్రుతినై
పరవశించనా

Monday, November 5, 2012

ముగ్ధ మనోహరం


ముగ్ధ మనోహరం





ఓ మనోహరీ,,,
నా అంతరంగ విహారీ..
దోబూచులాడావు ఇన్నళ్ళూ..
ఎదచేరి మురిపించవా ఈనాడు..

అని,,
ప్రేయసిని లాలించి..
ఆనామమే జపియించి..
ఆమెకై పరితపించి...
ఆమెహృదయసీమను పాలించె..


ఆమె డెందము సవ్వడి చేసింది..
అరవిందములో వెన్నెల కురిసింది..
కన్నుల కొలనులలో కలువలు పూసింది..
మృదుమథుర పలుకులతో మనసే మురిసింది..

వనములకు వసంతమొచ్చింది
మదనుడి శరానికి ఆజంట వశమైనది
ప్రకృతి పురుషుల కలయికతో
జగతి మురిసి పరవశమైనది.....

http://www.facebook.com/photo.php?fbid=441653609203097&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Friday, November 2, 2012

కలలు కనే కలువలు



కలలు కనే కలువలు

రా రాజు వస్తాడని
కలువలన్ని ముస్తాబైనాయి
కొత్త సొగసులతో స్వాగతిద్దామని

తామరాకుల అంచున
అచ్చంలా ముత్యాలు పేర్చి
కొలను అంతా కలయ చూస్తూ

ఒళ్ళంతా కళ్ళు చేసుకొని
నెలరేడును తిలకిస్తూ
తనువెంతో పులకిస్తూ
రేయంతా గడిపేస్తూ

నీలకాశంలో మబ్బుల దొంతరలలో
విహరించు ప్రశాంత వదన విహారి
నెలకొక్కమారైన పున్నమొచ్చేనని
పండు వెన్నెలలో తరింయించవచ్చని..

కలలు కనే ఈ కలువలు
http://www.facebook.com/photo.php?fbid=440681542633637&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Tuesday, November 27, 2012

మణి దీపం...


మణి దీపం...




మదిలొ మెదిలె ఆలోచనలకు
ప్రతిరూపాలు మన కళలే కదా
చిత్రమైనా ,,భావచిత్రమైనా
ప్రదర్శిస్తే బహు చిత్రమే కదా..

నా మనసున ఉన్న ఆలోచనలకు
ఒక రూపం కల్పించాను
ఆ రూపమే అపురూపమై
అమర దీపమైయ్యింది

హృదయ దీపం,, పదిలమైన మణి దీపం
జీవితాన వెన్నెల వెలుగులు నింపుతున్న దీపం
వెదురును, వేణువుగా మార్చిన దీపం
శిలను శిల్పంగా మార్చి మందిరాన నిలిపిన దీపం

Friday, November 23, 2012

విన్నపాలు...


విన్నపాలు...

ప్రియా,,,
నీ ముంగురులే చిటికెడు చీకటికాగా
నీ పెదవులపై చిరునవ్వే
పిడికెడు వెన్నెలగా విరపూయగా
నీ అరవిందములే
విరిసిన గుప్పెడు మల్లెలుకాగా..





తలచిన నామనసును
నీ తలపులతో నింపి
నీ విరహసందేశం
ఆ మేఘమాలతో పంపి
మెత్తని నీ హృదయంలో
సుతిమెత్తని నా గ్నాపకాలను
పదిలపరచానన్నాన్నవు..

వలచిన చెలికి ఏమని తెలుపను
మనసున పలికిన ఆమని పిలుపును

బంగారానికే సింగారమననా..
సింగారానికే వయ్యారమననా..
వయ్యారానికే వలపు పుట్టిందననా..
ఆ వలపే నీ తలపననా....
http://www.facebook.com/svs.vennela


Wednesday, November 21, 2012

నిన్నే తలచిందే ,, నా మనసు


నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు

పరుగెట్టే నీ వెనుకా,పడుతున్నాననుకోక
ఒక్కసారి చూడవే  ఓ నెలవంకా
అదిరేటి పెదవులపై అలుకెందుకె ఓ చిలుకా
పక్కనున్న మక్కువైన చెలికాడనునేనుండ


నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు

కంటి చూపుతోనే కావ్యాలను వ్రాసావు
వెన్నెలింటిలోనే నే విరహంతో వేచాను
నాతోడువు నీవైతే నీ నీడగ నేనుంటా
జగమంతా ఒకటైనా ఒటరినై ఎదిరిస్తా

నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు

http://www.facebook.com/svs.vennela

Friday, November 16, 2012

శుభాకాంక్షలు...

 శుభాకాంక్షలు...








సంకల్పం


సంకల్పం



ఆకాశం అందేనంటూ
ఎగసెటి అలనేనంటూ
విశ్వాసం నా ఊపిరిఅంటూ
విజయం నా బాటేనంటూ
చెప్పాలని ఉందంటూ
నీకంటూ నచ్చేట్టూ
జగమంతా మెచ్చేట్టూ

కొండలు పిండి చేయాలంటూ
మస్థిష్కమును మధించాలంటూ
ఎవరెష్టును ఎక్కాలంటూ
నైలునదినీ ఈదాలంటూ
చెప్పాలని ఉందంటూ
నీకంటూ నచ్చేట్టూ
జగమంతా మెచ్చేట్టూ

నీ స్వేదమె సంపద అంటూ
నేడే నిర్వేదం విడవమంటూ
సంకల్పం ధృఢమైతే
ఏరులెదురొచ్చినా
విజయుడవు నీవేనంటూ
చెప్పాలని ఉందంటూ
నీకంటూ నచ్చేట్టూ
జగమంతా మెచ్చేట్టూ


http://www.facebook.com/svs.vennela?ref=tn_tnmn

Wednesday, November 7, 2012

మనమంతా ఒకటై



హిమమంతా జలమై
జలమంతా జగమై
జగమంతా జనమై
జనమంతా మనమై

మనమంతా ఒకటై
ఒకటైన స్వరమై
ఆ సుస్వరమె ఒక వరమై
పరమశివుని పాద ధూళినై
ప్రణమిల్లిన ప్రక్రుతికి ఆక్రుతినై
పరవశించనా

Monday, November 5, 2012

ముగ్ధ మనోహరం


ముగ్ధ మనోహరం





ఓ మనోహరీ,,,
నా అంతరంగ విహారీ..
దోబూచులాడావు ఇన్నళ్ళూ..
ఎదచేరి మురిపించవా ఈనాడు..

అని,,
ప్రేయసిని లాలించి..
ఆనామమే జపియించి..
ఆమెకై పరితపించి...
ఆమెహృదయసీమను పాలించె..


ఆమె డెందము సవ్వడి చేసింది..
అరవిందములో వెన్నెల కురిసింది..
కన్నుల కొలనులలో కలువలు పూసింది..
మృదుమథుర పలుకులతో మనసే మురిసింది..

వనములకు వసంతమొచ్చింది
మదనుడి శరానికి ఆజంట వశమైనది
ప్రకృతి పురుషుల కలయికతో
జగతి మురిసి పరవశమైనది.....

http://www.facebook.com/photo.php?fbid=441653609203097&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater

Friday, November 2, 2012

కలలు కనే కలువలు



కలలు కనే కలువలు

రా రాజు వస్తాడని
కలువలన్ని ముస్తాబైనాయి
కొత్త సొగసులతో స్వాగతిద్దామని

తామరాకుల అంచున
అచ్చంలా ముత్యాలు పేర్చి
కొలను అంతా కలయ చూస్తూ

ఒళ్ళంతా కళ్ళు చేసుకొని
నెలరేడును తిలకిస్తూ
తనువెంతో పులకిస్తూ
రేయంతా గడిపేస్తూ

నీలకాశంలో మబ్బుల దొంతరలలో
విహరించు ప్రశాంత వదన విహారి
నెలకొక్కమారైన పున్నమొచ్చేనని
పండు వెన్నెలలో తరింయించవచ్చని..

కలలు కనే ఈ కలువలు
http://www.facebook.com/photo.php?fbid=440681542633637&set=a.411924015509390.84124.100000753849169&type=1&theater